Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.
66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
6 సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
47 బబులోనువారి బూటకపు దేవతలను నేను శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది.
బబులోను రాజ్యం యావత్తు అవమాన పర్చబడుతుంది.
అనేకమంది ప్రజలు చనిపోయి నగర వీధుల్లో పడివుంటారు.
48 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత
బబులోనుకు జరిగిన దాని విషయమై సంతోషంతో కేకలు పెడతారు.
శత్రు సైన్యాలు ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం చేస్తాయి
గనుక వారునూ కేకలు పెడతారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
49 “బబులోను ఇశ్రాయేలు ప్రజలను చంపింది.
భూమి మీద ప్రతి ప్రాంతంలోని ప్రజలనూ బబులోను చంపింది.
కావున బబులోను తప్పక పతనమవ్వాలి!
50 కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి;
బబులోనును వదిలిపొండి.
ఆగకండి!
మీరు ఎంతో దూరానగల దేశంలో వున్నారు.
కాని మీరున్న చోటనే యెహోవాను తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసుకొనండి.
51 “యూదా ప్రజలమైన మేము సిగ్గుపడుతున్నాము.
మేము అవమానింపబడినందున మేము సిగ్గుపడుతున్నాము.
అది ఎందువల్లనంటే పరాయివాళ్లు మా దేవుని దేవాలయంలోని
పవిత్ర స్థలాల్లో ప్రవేశించారు.”
52 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను విగ్రహాలను
నేను శిక్షించే సమయం వస్తోంది.
ఆ సమయంలో, ఆ రాజ్యంలోని ప్రతిచోటా
గాయపడిన ప్రజలు బాధతో మూలుగుతారు.
53 ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు.
బబులోను తన కోటలను పటిష్ఠం చేసికోవచ్చు
కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని పంపుతాను.
ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
54 “బబులోనులో ప్రజల ఆక్రందనలు మనం వినగలం.
కల్దీయుల రాజ్యంలో ప్రజలు చేస్తున్న విధ్వంసకాండ శబ్దాలను మనం వింటాం.
55 అతి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం చేస్తాడు.
నగరంలో వినవచ్చే గొప్ప సందడిని ఆయన అణచి వేస్తాడు.
మహాసముద్రపు అలలు ఘోషించినట్లు శత్రువులు వచ్చిపడతారు.
చుట్టు పట్లవున్న ప్రజలు ఆ గర్జన వింటారు.
56 సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది.
బబులోను సైనికులు పట్టుబడతారు. వారి ధనుస్సులు విరిగిపోతాయి.
ఎందువల్లనంటే, వారు చేసిన పాపాలకు యెహోవా ఆ ప్రజలను శిక్షిస్తాడు.
వారికి తగిన పూర్తి దండన యెహోవా విధిస్తాడు.
57 బబులోను యొక్క ముఖ్యమైన అధిపతులను,
జ్ఞానులను మత్తిల్లజేస్తాను.
దాని పాలకులను, అధికారులను,
సైనికులను కూడ మత్తిల్లజేస్తాను.
దానితో వారు శాశ్వతంగా నిద్రిస్తారు.
వారు ఎప్పిటికీ మేల్కొనరు.”
ఈ విషయాలు రాజు చెప్పియున్నాడు.
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
58 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోను యొక్క మందమైన, బలమైన గోడ కూలగొట్టబడుతుంది.
దాని ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి.
బబులోను ప్రజలు కష్టపడి పనిచేస్తారు.
కాని అది వారికి సహాయపడదు!
నగరాన్ని రక్షించటంలో వారు మిక్కిలి అలసిపోతారు.
కాని వారు ఎగసేమంటల్లో కేవలం సమిధలవుతారు!”
చందాలు సేకరించటం
8 సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం. 2 వాళ్ళ కష్టాలు వాళ్ళను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, వాళ్ళు యివ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు. 3 వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. 4 విశ్వాసులైనవారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. 5 మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు.
6 ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించమని వేడుకొన్నాము. మీరు చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తిచేసాడు. 7 మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరిని మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరిని మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను.
© 1997 Bible League International