Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నెహెమ్యా 6-7

ఎదురైన మరిన్ని సమస్యలు

నేను ప్రాకార నిర్మాణం పూర్తి చేశానన్న సంగతిని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము మా ఇతర శత్రువులూ విన్నారు. మేము గోడలోని కంతలన్నీ పూడ్చాము. అయితే, ద్వారాలకు మేమింకా తలుపులు అమర్చలేదు. సన్బల్లటూ, గెషెమూ నాకు, “నెహెమ్యా, నువ్వొకసారి వస్తే మనం కలుసు కుందాము. ఓనో మైదానంలోని కెఫీరిము గ్రామంలో కలుసుకోవచ్చు” అని కబురంపారు. అయితే, వాళ్లు నాకు హాని తలపెట్టారని నాకు తెలుసు.

అందుకని, దూతల ద్వారా నేను వాళ్లకి, “నేను చాలా ముఖ్యమైన పనిలో నిమగ్నమై వున్నాను. అందు కని, నేను రాలేను. మిమ్మల్ని కలుసు కొనడానికై నేను పని చేయుట ఆపినప్పుడు, పని ఆగుట నాకిష్టము లేదు” అని సమాధానం పంపాను.

సన్బల్లటూ, గెషెమూ అదే సందేశాన్ని నాకు నాలుగుసార్లు పంపారు. ప్రతి ఒక్కసారీ నేను వాళ్లకి నా వెనకటి సమాధానమే పంపాను. అప్పుడు అయిదవసారి, సన్బల్లటు అదే సందేశాన్ని తన సహాయకుని ద్వారా నాకు పంపాడు. అతడి చేతిలో విప్పియున్న ఒక లేఖవుంది. ఆ లేఖలో ఇలా పేర్కొనబడింది,

“ఒక విషయం నాలుగు ప్రక్కలా ప్రచారమవుతోంది. ఎక్కడ చూసినా జనం అదే చెప్పుకుంటున్నారు. మరి, అన్నట్టు, గెషెము అది నిజమే అంటున్నాడు. నీవూ, యూదులూ రాజు మీద తిరగబడాలని కుట్రపన్నుతున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అందుకే నీవు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్నావట. అంతేకాదు, నీవు యూదులకు కాబోయే రాజువని కూడా జనం చెప్పుకుంటున్నారు. యెరూషలేములో నిన్ను గురించి ఈ విషయాన్ని ప్రకటించేటందుకు నీవు ప్రవక్తలను ఎంపిక చేశావన్న విషయం, ‘యూదాలో ఒక రాజు వున్నాడు!’ అన్న విషయం ప్రచారంలో వుంది.

“నెహెమ్యా, ఇప్పుడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. అర్తహషస్త రాజురు ఈ విషయం వింటారు. అందుకని, నీవు రా, మనం కలిసి కూర్చుని ఈ విషయం మాట్లాడుకుందాము.”

అందుకని, నేను సన్బల్లటుకి ఈ క్రింది సమాధానం పంపాను: “మీరు చెబుతున్నదేమీ ఇక్కడ జరగడం లేదు. ఇదంతా మీ ఊహా కల్పితం మాత్రమే.”

మన శత్రువులు మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మట్టుకు వాళ్లు, “ఈ యూదులు భయంతో బిక్కచచ్చి, జావకారిపోయి పని కొనసాగించేందుకు అసమర్థులవుతారు. అప్పుడిక ప్రాకార నిర్మాణం పూర్తికాదు” అనుకుంటున్నారు.

కాని నేను, “దేవా, నన్ను బలపరచుము” అని ప్రార్థించాను.

10 నేనొక రోజున దెలాయ్యా కొడుకు షెమయా ఇంటికి వెళ్లాను. దెలాయ్యా మెహేతబేలు కొడుకు. ఇంటి వద్దనే వుండవలసిన షెమయా ఇలా అన్నాడు: “నెహెమ్యా, ఆలయానికి పోయి కూర్చుందాము. లోపలికి పోయి తలుపులు మూసుకుందాము. ఎందుకంటే నిన్ను చంపేందుకు మనుష్యులు వస్తున్నారు. ఈ రాత్రి నిన్ను చంపేందుకు వాళ్లొస్తున్నారు.”

11 అయితే, నేను షెమయాతో ఇలా అన్నాను: “నాలాంటి మనిషి పారిపోవాలంటావా? నాలాంటి వాడు తన ప్రాణం కాపాడుకొనేందుకు దేవాలయంలోకి పారిపోకూడదు, నేనలా వెళ్లను!”

12 షెమయాని దేవుడు పంపించలేదని నాకు తెలుసు. టోబీయా, సన్బల్లటు అతనికి డబ్బు ముట్టజెప్పారు కనుక, అతను నాకు వ్యతిరేకంగా హితబోధ చేశాడు. 13 నన్ను ఇరుకున పెట్టేందుకూ, భయపెట్టేందుకూ వాళ్లు షెమయాని కుదుర్చుకున్నారు. భయపడి, ఆలయానికి పారిపోవడం ద్వారా నేను పాపం చెయ్యాలని వాళ్లు కోరుకున్నారు. అప్పుడు, నన్ను భయపెట్టి, నాకు అపకీర్తి తెచ్చేందుకు నా శత్రువులకి అవకాశం చిక్కి వుండేది.

14 ఓ నా దేవా, దయచేసి టోబియా, సన్బల్లటులు చేస్తున్న పనులు గమనించు. వాళ్లు చేసిన పాపిష్టి పనులు కూడా గుర్తు చేసుకో. నన్ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నోవద్యా అనే ప్రవక్త్రిని, తదితర ప్రవక్తలను కూడా గుర్తు చేసుకో.

ప్రాకార నిర్మాణం పూర్తయింది

15 ఈ విధంగా యెరూషలేము ప్రాకార నిర్మాణం ఏలూలు[a] నెల ఇరవై ఐదవ రోజున పూర్తయింది. ఆ గోడ కట్టడం పూర్తి చేసేందుకు ఏభై రెండు రోజులు పట్టింది. 16 అప్పుడు, మేము గోడ కట్టడం పూర్తి చేసినట్లు మా శత్రువులందరూ విన్నారు. గోడ కట్టడం పూర్తయిందన్న విషయాన్ని మా చుట్టు ప్రక్కల దేశపు ప్రజలందరూ చూశారు. దానితో, వాళ్లు ధైర్యం కోల్పోయారు. ఎందుకంటే, ఈ పని మన దేవుని సహాయం వల్ల జరిగిందని వాళ్లు అర్థం చేసుకున్నారు.

17 అంతేకాదు, ఆ రోజుల్లో, గోడ కట్టడం పూర్తయిన దరిమిలా, యూదాలోని ధనికులు టోబీయాకి ఎన్నో ఉత్తరాలు పంపుతూవచ్చారు. టోబీయా వాళ్ల జాబులకి సమాధానాలు వ్రాస్తూండే వాడు. 18 యూదాలో చాలామంది అతనికి విధేయులుగా వుంటామని మాట ఇచ్చినందువల్ల, వాళ్లు అతనికి ఆ జాబులు వ్రాశారు. దీనికి కారణం ఏమిటంటే, టోబీయా అరహు కుమారుడైన షెకన్యాకి అల్లుడు. టోబీయా కొడుకు యోహానాను మెషూల్లము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మెషూల్లము బెరెక్యా కొడుకు. 19 గతంలో వాళ్లు టోబీయాకి ఒక ప్రత్యేక వాగ్దానం చేశారు. అందుకని, వాళ్లు నాకు టోబీయా ఎంతో మంచివాడని చెప్తూ వచ్చారు. నేను చేస్తున్న పనులను గురించి వాళ్లు టోబీయాకి చెప్తూండేవారు. నన్ను భయపెట్టేందుకని టోబీయా నాకు లేఖలు పంపుతూ వచ్చాడు.

ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము. అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకు అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు. అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకుగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”

తిరిగి వచ్చిన బందీల జాబితా

అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసినంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు. జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.

చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు నెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత పట్టణానికి పోయాడు. ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు[b] తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:

పరోషు వంశీయులు2,172
షెపట్యా వంశీయులు372
10 ఆరహు వంశీయులు652
11 పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు వంశపు వాళ్లు)2,818
12 ఏలాము వంశీయులు1,254
13 జత్తూ వంశీయులు845
14 జక్కయి వంశీయులు760
15 బిన్నూయి వంశీయులు648
16 బేబై వంశీయులు628
17 అజ్గాదు వంశీయులు2,322
18 అదోనీకాము వంశీయులు667
19 బిగ్వయి వంశీయులు2,067
20 ఆదీను వంశీయులు655
21 హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు98
22 హాషూము వంశీయులు328
23 బేజయి వంశీయులు324
24 హారీపు వంశీయులు112
25 గిబియోను వంశీయులు95
26 బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు188
27 అనాతోతు పట్టణం వాళ్లు128
28 బేతజ్మావెతు పట్టణం వాళ్లు42
29 కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్టణాల వాళ్లు743
30 రమా, గెబ పట్టణాల వాళ్లు621
31 మిక్మషు పట్టణం వాళ్లు122
32 బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు123
33 రెండవ నెబో పట్టణం వాళ్లు52
34 రెండవ ఏలాము పట్టణం వాళ్లు1,254
35 హారిము పట్టణం వాళ్లు320
36 యెరికో పట్టణం వాళ్లు345
37 లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు721
38 సెనాయా పట్టణం వాళ్లు3,930

39 వీళ్లు యాజకులు:

యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు973
40 ఇమ్మేరు వంశీయులు1,052
41 పషూరు వంశీయులు1,247
42 హారిము వంశీయులు1,017

43 లేవీ వంశానికి చెందిన వాళ్లు:

యేషువా, హోదేయా,[c] కద్మీయులు74

44 వీళ్లు గాయకులు:

ఆసావు వంశీయులు148

45 వీళ్లు ద్వారపాలకులు:

షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు138

46 వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు:

జీహా, హశూఫా, టబ్బాయేలు

47 కేరోసు, సీయహా, పాదోను,

48 లెబానా, హగాబా, షల్మయి,

49 హానాను, గిద్దేలు, గహరు

50 రెవాయ, రెజీను, నెకోదా,

51 గజ్జాము, ఉజ్జా, పాసెయ.

52 బేసాయి, మెహూనీము, నెపూషేసీము.

53 బక్బూకు, హకూఫా, హర్హూరు,

54 బజ్లీతు, మెహీదా, హర్షా,

55 బర్కోసు, సీసెరా, తెమాహా,

56 నెజీయహు, హటేపా.

57 సొలొమోను దాసుల వంశాలకు చెందిన వారు:

సొటయి, సోపెరెతు, పెరూదా,

58 యహలా, దర్కొను, గిద్దేలు,

59 షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.

60 ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం392

61 కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.

62 దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు642

63 యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు

హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా పరిగణింపబడ్డారు.)

64 వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చబడలేదు. 65 అత్యంత పవిత్రమైన వస్తువులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము[d] ఉపయోగించి, దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి, ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశుద్ధ వస్తువుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.

66-67 మొత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 68-69 వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు వున్నాయి.

70 కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు. 71 కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనుల బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు. 72 మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము, 1 1/3 టన్నుల వెండిని, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.

73 ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమ తమ స్వంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ స్వంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల[e] నాటికి ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International