Revised Common Lectionary (Semicontinuous)
71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
నా మాట వినుము. నన్ను రక్షించుము.
3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
20 యెహోవా ఇలా అన్నాడు:
“మీరు షేబ[a] దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు?
దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు?
మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు!
మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”
21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:
“యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను.
ప్రజల ఎదుట అడ్డుబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి.
తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు.
స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”
22 యెహోవా ఇలా అన్నాడు:
“ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది.
భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.
23 సైనికులు విల్లంబులు, ఈటెలు పట్టుకొనివస్తారు.
వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు.
వారు మిక్కిలి శక్తిమంతులు!
వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది.
ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది.
ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”
24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము.
భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము.
కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము.
స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.
25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు!
మీరు బాట వెంబడి వెళ్లవద్దు.
ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి.
పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.
26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి.
బూడిదలో పొర్లండి[b]
చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి!
మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి.
ఇవన్నీ మీరు చేయండి;
కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!
27 “యిర్మీయా, నేను (యెహోవా)
నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను.
నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు,
వారిని గమనిస్తూ ఉండుము.
28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు;
వారు చాలా మొండివారు.
వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు.
వారు తుప్పుతో కప్పబడియున్న కంచు,
ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.
29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు.
కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది.
కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది![c]
శుద్ద వెండిని చేయాలనుకోవటం వృధా ప్రయాస.
వృధా కాలయాపన.
అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు.
యెహోవా వారిని ఆమోదించలేదు
గనుక వారికాపేరు పెట్టబడింది.”
థెస్సలొనీకలో
17 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. 2 అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. 3 క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. 4 తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.
5 ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. 6 వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. 7 వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.
8 ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. 9 ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.
© 1997 Bible League International