Revised Common Lectionary (Semicontinuous)
నూన్
105 యెహోవా, నీ వాక్యాలు
నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
32 “ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను.
భూమి నానోటి మాటలు వినునుగాక!
2 నా ప్రబోధం వర్షంలా పడుతుంది,
నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది,
మెత్తటి గడ్డిమీద పడే జల్లులా ఉంటుంది.
కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
3 యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి!
4 “ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు
ఆయన పని పరిపూర్ణం!
ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక.
ఆయన సత్యవంతుడు
నమ్ముకోదగ్గ దేవుడు.
5 ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా.
మీరు నిజంగా ఆయన పిల్లలు కారు.
మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు.
మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు.
6 యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా?
మీరు బుద్ధిహీనులు, అజ్ఞానులు,
యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు.
ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు.
7 “పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి,
అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి.
మీ తండ్రిని అడగండి, ఆయన చెబుతాడు;
మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.
8 రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు.
ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు.
తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని
ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు.
9 ఆయన ప్రజలే యెహోవా వంతు;
యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం.
10 “అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు,
వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి,
ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు.
యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు.
ఉద్దేశ్యం
14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా 16 నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కానివాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కానివాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు.
17 అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను. 18 క్రీస్తు నా ద్వారా చేసినవాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు. 19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను. 20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు. 21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఆయన్ని గురించి చెప్పబడినవాళ్ళు చూస్తారు.
కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి విననివాళ్ళు అర్థం చేసుకొంటారు.”(A)
© 1997 Bible League International