Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 22:19-28

19 యెహోవా, నన్ను విడువకుము!
    నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
    ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
    ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.

22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
    ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
    ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
    ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
    యెహోవా వారిని ద్వేషించడు.
    ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.

25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
    నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
    యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
    మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
    ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
    ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.

యెషయా 57:1-13

ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వెంబడించరు

57 మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ వ్యక్తి అది గమనించలేదు.
    ఏం జరుగుతుందో ప్రజలు గ్రహించరు.
కానీ వారు మంచి మనుష్యులందరిని సమావేశపరచారు.
    కష్టాలు వస్తున్నాయని ప్రజలు గ్రహించరు.

మంచి వాళ్లంతా భద్రతకోసం
    సమావేశం చేయబడ్డారని వారికి తెలియదు.
అయితే శాంతి కలుగుతుంది. మరియు ప్రజలు వారి స్వంత పడకలమీద విశ్రాంతి తీసుకొంటారు.
    వారు ఎలా జీవించాలని దేవుడు కోరుతాడో వారు అలా జీవిస్తారు.

“దయ్యాల పిల్లల్లారా, ఇక్కడకు రండి.
    మీ తండ్రి (సాతాను) లైంగిక పాపాల మూలంగా దోషి.
    మరియు మీ తల్లి (ఇశ్రాయేలు) లైంగిక పరంగా తన శరీరాన్ని అమ్ముకొంటుంది. ఇక్కడకు రండి!
మీరు అబద్ధాలు చెప్పేవాళ్లు, చెడ్డవాళ్లు.
    మీరు నన్ను ఎగతాళి చేస్తారు.
మీరు నన్ను వెక్కిరిస్తారు.
    మీరు నా మీద నాలుకలు చాపుతారు.
మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని చెట్టు క్రింది
    తప్పుడు దేవుళ్లనూ పూజించటమే.
మీరు ప్రతికాలువ ప్రక్క పిల్లల్నీ చంపుతారు,
    బండల స్థలాల్లో వారిని బలి ఇస్తారు.
నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు ఇష్టం.
    వాటిని పూజించుటకు మీరు వాటిమీద ద్రాక్షమద్యం పోస్తారు.
మీరు వాటికి బలులు ఇస్తారు. కానీ మీకు దొరికేది అంతా ఆ రాళ్లే.
    ఇది నాకు సంతోషం కలిగిస్తుందని మీరు తలుస్తున్నారా?
    లేదు! అది నాకు సంతోషం కలిగించదు.
మీరు ప్రతి కొండ మీద,
    ప్రతి పర్వతంమీద మీ పడక వేసుకొంటారు.
మీరు ఆ స్థలాలకు వెళ్లి
    బలులు అర్పిస్తారు.
తర్వాత మీరు ఆ పడకల మీదికి వెళ్లి,
    ఆ దేవుళ్లను ప్రేమించటం ద్వారా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు.
మీరు ఆ దేవతలను ప్రేమిస్తారు.
    వాటి దిగంబర దేహాలను చూడటం మీకు ఇష్టం.
మీరు నాతో ఉన్నారు
    కాని వాటితో ఉండేందుకు మీరు నన్ను విడిచి పెట్టారు.
నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు
    సహాయపడే వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
గుమ్మాల వెనుక, ద్వారబంధాల వెనుక వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
    మరియు మీరు వెళ్లి ఆ తప్పుడు దేవుళ్ళతో ఒడంబడికలు చేసుకుంటారు.
మొలెక్[a] దేవతకు అందంగా కనబడాలని
    మీరు తైలాలు, పరిమళాలు ఉపయోగిస్తారు.
మీరు మీ సందేశకులను దూరదేశాలకు పంపించారు.
    ఇది మిమ్మల్ని పాతాళానికి, మరణ స్థానానికి తీసుకొని వస్తుంది.
10 ఈ పనులు చేయటానికి మీరు కష్టపడి పని చేశారు
    కానీ మీరు ఎన్నడూ అలసిపోలేదు.
మీరు క్రొత్త బలం కనుగొన్నారు.
    ఎందుకంటే, వీటిలో మీరు ఆనందించారు.
11 మీరు నన్ను జ్ఞాపకం చేసికోలేదు
    మీరు నన్ను కనీసం గుర్తించలేదు.
కనుక మీరు ఎవరిని గూర్చి చింతిస్తున్నారు?
    మీరు ఎవరిని గూర్చి భయపడుతున్నారు?
    మీరెందుకు అబద్ధం పలికారు?
చూడండి, చాలాకాలంగా నేను మౌనంగా ఉన్నాను.
    మరి మీరు నన్ను గౌరవించలేదు.
12 మీ ‘మంచితనం’ గూర్చి, మీరు చేసే ‘మతపరమైన’ పనులు అన్నింటిని గూర్చి నేను చెప్పగలను.
    కానీ అవన్నీ పనికిమాలినవి.
13 మీకు సహాయం అవసరమైనప్పుడు
    మీరు మీ చుట్టూరా ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవుళ్ళకు మొరపెట్టండి.
అయితే, వాటినన్నింటినీ గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతున్నాను.
    ఒక్క గాలి విసురు వాటినన్నింటినీ మీ వద్దనుండి తొలగించివేస్తుంది.
అయితే నా మీద ఆధారపడే వ్యక్తి
    భూమిని సంపాదించుకొంటాడు.
    ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది.”

గలతీయులకు 3:15-22

ధర్మశాస్త్రము, వాగ్దానము

15 సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు చెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. 16 అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు.[a] కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. 17 నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు.

18 అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు.

19 మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. 20 కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి.

మోషే ధర్మశాస్త్రం యెక్క ఉద్దేశ్యం

21 మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. 22 కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్ళకే యివ్వబడుతుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International