Revised Common Lectionary (Complementary)
దావీదు ప్రార్థన.
145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
2 ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
6 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
7 నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.
8 యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
3 ఆ సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి.
వారి దుస్తులు మిరుమిట్లు గొలిపేటంత ఎర్రగా ఉన్నాయి.
వారి రథాలు యుద్ధానికి బారులు తీర్చబడి, అగ్ని శిఖల్లా మెరుస్తున్నాయి.
వారి గుర్రాలు స్వారీకి సిద్ధంగా ఉన్నాయి!
4 రథాలు వీధులలో దూసుకు పోతున్నాయి.
బహిరంగ ప్రదేశాలలో అవి ముందుకు, వెనుకకు పోతున్నాయి.
అవి మండే దివిటీల్లా, ఒక చోటనుండి మరొక చోటికి
ప్రసరించే మెరుపుల్లా కనిపించాయి!
5 అష్షూరు రాజు తన మంచి సైనికులందరినీ పిలుస్తాడు.
కాని వారు తొట్రిల్లి దారిలో పడిపోతారు.
గోడను రక్షించటానికి వారు దాని వద్దకు పరుగెడతారు.
రక్షక కవచాన్ని వారు కిందికి దించుతారు.
6 కాని నదివైపు ద్వారాలు తెరచి ఉన్నాయి.
శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు.
7 శత్రువు రాణిని ఎత్తుకు పోతాడు.
ఆమె దాసీలు పావురాల్లా విచారంగా మూల్గుతారు.
వారు విచారాన్ని వ్యక్తపరుస్తూ తమ రొమ్ములు బాదుకుంటారు.
8 నీరు బయటకు కారిపోతే ఉండే ఒక మడుగులా
నీనెవె నగరం ఉంది. ప్రజలు,
“ఆగండి! పారిపోవటం మానండి!” అని అరుస్తారు.
కాని ఎవ్వడూ ఆగడు. వారు చెప్పేదాన్ని ఎవ్వరూ. లక్ష్యపెట్టరు!
9 నీనెవెను నాశనం చేస్తున్న సైనికులారా, వెండిని తీసుకోండి!
బంగారాన్ని దోచుకోండి!
తీసుకోటానికి అనేక వస్తువులున్నాయి.
ఎన్నో ధనాగారాలున్నాయి!
10 ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది.
ప్రతీదీ దోచుకోబడింది.
నగరం నాశనం చేయబడింది!
ప్రజలు వారి ధైర్యాన్ని కోల్పోయారు.
వారి హృదయాలు భయంతో వికలమవుతున్నాయి.
వారి మోకాళ్ళు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి.
వారి శరీరాలు వణుకుతున్నాయి
వారి ముఖాలు భయంతో వెలవెల పోతున్నాయి.
11 సింహపు గుహ (నీనెవె) ఇప్పుడు ఎక్కడుంది?
ఆడ, మగ సింహాలు అక్కడ నివసించాయి.
వాటి పిల్లలు భయపడలేదు.
12 ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి పర్చటానికి
అనేక మంది మనుష్యులను చంపింది.
అతడు తన గుహను (నీనెవె) మానవకళేబరాలతో నింపివేశాడు.
అతడు తాను చంపిన స్త్రీలతో తన గుహను నింపాడు.
13 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:
“నీనెవే, నేను నీకు వ్యతిరేకిని!
నీ రథాలను నేను తగులబెడతాను.
యుద్ధంలో నీ ‘యువ సింహాలను’ నేను చంపుతాను.
భూమి మీద మరెన్నడూ నీవు ఎవరినీ వెంటాడవు.
నీ దూతలు చెప్పేవాటిని
ప్రజలు మరెన్నడూ వినరు.”
5 మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. 6 మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. 7 మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. 8 మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. 9 మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.
© 1997 Bible League International