Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.
18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
అతడీలాగన్నాడు.
2 యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.
3 యెహోవాకు నేను మొరపెడ్తాను.
యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు.
నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.
21 నేను యెహోవాను అనుసరించాను.
నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు.
22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను.
ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.
23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను.
నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.
24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు.
నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.
25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు.
మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.
26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైనవాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైనవాడవు.
కాని, గర్విష్ఠులను, టక్కరివాళ్లను నీవు అణచివేస్తావు.
27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు.
కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.
28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు.
నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను.
నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.
30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం.
ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు.
మన దేవుడు తప్ప మరో బండ[a] లేదు.
32 దేవుడు నాకు బలం ఇస్తాడు.
ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.
18 మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు.
మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు.
19 “యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల
ఆయన అది చూచి తన ప్రజలను నిరాకరించాడు.
20 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు,
‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను.
వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను.
ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు
వారు అపనమ్మకమైన పిల్లలు.
28 “వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు.
29 వారు తెలివిగల వాళ్లయితే
వారు దీనిని గ్రహిస్తారు.
భవిష్యత్తులో వారి అంతం గూర్చి ఆలోచిస్తారు.
30 ఒకడు 1,000 మందిని తరిమితే
ఇద్దరు 10,000 మంది పారిపోయేటట్టు ఎలా చేయగలరు?
యెహోవా వారిని వారి శత్రువుకు అప్పగిస్తేనే
అలా జరుగుతుంది.
ఆ ఆశ్రయ దుర్గం (యెహోవా) ఈ శత్రువులను అమ్మివేస్తే,
యెహోవా ఈ శత్రువులను వారికి అప్పగిస్తే మాత్రమే యిలా జరుగుతుంది.
31 ఈ శత్రువుల ఆశ్రయ దుర్గం మన బండ[a] (యెహోవా) వంటి శక్తిమంతుడు కాడు.
ఇది సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు.
32 ఈ శత్రువుల ద్రాక్ష సొదొమ ద్రాక్ష వంటిది. గొముర్రా[b] పొలాలలోని దాని వంటిది.
వారి ద్రాక్షా పండ్లు విషపు ద్రాక్షలు. వారి ద్రాక్షా పండ్ల గుత్తులు చేదు.
33 వారి ద్రాక్షారసం కృర సర్పాల విషం, నాగు పాముల కఠిన విషం.
34 “ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను
‘నా గిడ్డంగిలో తాళం వేసి దీనిని
నేను భద్రపరుస్తున్నాను అని యెహోవా చెబుతున్నాడు.
35 ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి
వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే;
ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది
వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’
36 “యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు.
వారు ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపిస్తాడు.
వారి శక్తి పోయేటట్టు ఆయన చేస్తాడు.
బానిసగాని స్వతంత్రుడు గాని వారంతా
నిస్సహాయులయ్యేటట్టు ఆయన చేస్తాడు.
37 అప్పుడు ఆయన ఇలా అంటాడు,
‘అబద్ధపు దేవుళ్లు ఎక్కడ?
భద్రత కోసం వారు ఆశ్రయించిన బండ ఎక్కడ?
38 ఈ ప్రజల దేవుళ్లు ప్రజల బలి అర్పణల కొవ్వు తిన్నారు.
వారి పానార్పణపు ద్రాక్షారసం వారు తాగారు.
కనుక ఈ దేవుళ్లనే లేచి మీకు సహాయం చేయనివ్వండి.
వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి!
39 “‘అప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే
దేవుణ్ణి. ఇంకే దేవుడూ లేడు.
ప్రజలను బ్రతకనిచ్చేది,
చంపేదీ నిర్ణయించే వాడ్ని నేనే.
నేను ప్రజల్ని బాధించగలను,
బాగు చేయగలను.
నా శక్తినుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు.
స్తుతి
33 దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.
34 “ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు?
ఆయనకు సలహా చెప్పేవాడెవరు?”(A)
35 “దేవునికి ఎవరు అప్పిచ్చారు?
ఆయన ఎవరికీ ఋణపడలేదు.”(B)
36 అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International