Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఎజ్రా 1-3

యూదుల చెర విముక్తికి కోరెషు సహాయం

పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం,[a] యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం[b] వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:

“పారశీక రాజు కోరెషు తెలియజేసేది ఏమంటే:

పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకంలోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచుకున్నాడు. యెరూషలేములో వున్న ఇశ్రాయేలీయుల దేవుడే ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మనుష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ వలసిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. యూదా దేశంలోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి ఇశ్రాయేలీయుల్లో మిగిలివున్నవాళ్లు[c] ఎక్కడైనా ఉన్నట్లయితే, వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశేషులకు వెండిది బంగారాలు, ఆవులు, వగైరాలు ఇవ్వాలి. యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి కానుకలు ఇవ్వాలి.”

యూదా, బెన్యామీను వంశాలకు చెందిన కుటుంబాల పెద్దలు యెరూషలేముకు పోయేందుకు సన్నద్ధ మయ్యారు. వాళ్లు యెరూషలోములో దేవాలయ నిర్మాణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేముకు పోయేందుకు సంసిద్ధుడయ్యాడు. వాళ్ల ఇరుగుపొరుగు వారు వాళ్లకి అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు పొరుగువారు వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చారు. పూర్వం నెబుకద్నెజరు యెరూషలేమునందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్ధపు దేవతల ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు మహారాజు బయటికి తీయించాడు. పారశీక రాజైన కోరెషు ఆ వస్తువులను బయటికి తీసుకురమ్మని తన ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు మిత్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి తీయించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు[d] అప్పగించాడు.

మిత్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల జాబితా యిది: బంగారు గిన్నెలు 30, వెండి గిన్నెలు 1,000, చాకులు, పెనాలు 29, 10 బంగారు పాత్రలు 30, బంగారు పాత్రల వంటివే వెండి పాత్రలు 410, ఇతర పాత్రలు 1,000.

11 వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, షేష్బజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో యెరూషలేముకు తీసుకువెళ్లాడు.

యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్ల జాబితా

వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమ తమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు. జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:

పరోషు వంశస్థులు2,172
షెపట్యా వంశస్థులు372
అరహు వంశస్థులు775
యేషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు2,812
ఏలాము వంశస్థులు1,254
జత్తూ వంశస్థులు945
జక్కయి వంశస్థులు760
10 బానీ వంశస్థులు642
11 బేబై వంశస్థులు623
12 అజ్గాదు వంశస్థులు1,222
13 అదొనీము వంశస్థులు666
14 బిగ్వయి వంశస్థులు2,056
15 అదీను వంశస్థులు454
16 అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం)98
17 బెజయి వంశస్థులు323
18 యోరా వంశస్థులు112
19 హాషుము వంశస్థులు223
20 గిబ్బారు వంశస్థులు95
21 బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు123
22 నెటోపా పట్టణం వాళ్లు56
23 అనాతోతు పట్టణంవాళ్లు128
24 అజ్మావెతు పట్టణంవాళ్లు42

25 కిర్యాతారీము, కెఫీరా,

బెయేరోతు పట్టణాల వాళ్లు743
26 రమా, గెబా పట్టణాలవాళ్లు621
27 మిక్మషు పట్టణం వాళ్లు123
28 బేతేలు, హాయి పట్టణంవాళ్లు222
29 నెబో పట్టణంవాళ్లు52
30 మగ్బీషు పట్టణంవాళ్లు156
31 ఏలాము అనే మరో పట్టణంవాళ్లు1,254
32 హారీము పట్టణంవాళ్లు320
33 లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు725
34 యెరికో పట్టణంవాళ్లు345
35 సెనాయా పట్టణంవాళ్లు3,630

36 యాజకులు:

యేషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు973
37 ఇమ్మేరు వంశస్థులు1,052
38 పషూరు వంశస్థులు1,247
39 హారీము వంశస్థులు1,017

40 ఇప్పుడిక లేవీయులలో

హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు74

41 గాయకుల జాబితా:

అసాపు వంశస్థులు128

42 దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు

షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు139

43 దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు

జీహా, హశూపా, టబ్బాయోతు,

44 కేరోసు, సీయహా, పాదోను,

45 లెబానా, హగాబా, అక్కూబు,

46 హాగాబు, షల్మయి, హానాను,

47 గిద్దేలు, గహరు, రెవాయా,

48 రెజీను, నెకోదా, గజ్జాము,

49 ఉజ్జా, పాసెయ, బేసాయి,

50 అస్నా, మెహూనీము, నెపూసీము,

51 బక్బూకు, హకూపా, హర్హూరు

52 బజ్లీతు, మెహీదా, హర్షా

53 బర్కోసు, సీసెరా, తెమహు

54 నెజీయాహు, హటీపా,

55 సొలొమోను సేవకుల వంశస్థులు:

సొటయి, సోపెరెతు, పెరూదా,

56 యహలా, దర్కోను, గిద్దేలు,

57 షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి

58 దేవాలయ సేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తం392

59 తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,

60 దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం652

61 యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు:

హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.)

62 వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులుగా సేవ చేయలేకపోయారు. 63 వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము[e] ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.

64-65 మొత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 66-67 వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.

68 ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు పూనుకొన్నారు. 69 వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3 టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు.

70 ఈ విధంగా యాజకులు, లేవీ గోత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.

బలిపీఠ పునర్నిర్మాణం

అలా ఏడవ నెల[f] నాటికి ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాలకు చేరుకున్నారు. అప్పుడు వాళ్లందరూ యెరూషలేములో గుమికూడి ఒక ప్రజగా సమైక్యమయ్యారు. యెజాదా కొడుకైన యేషూవ, అతనితో వున్న యాజకులూ, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని సహచరులు ఇశ్రాయేలు దేవునికి బలిపీఠం నిర్మించారు. ఇశ్రాయేలీయులు తాము బలులు సమర్పించ గలిగేందుకు వీలుగా ఆ బలిపీఠాన్ని నిర్మించారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో పేర్కొనబడినట్లు వాళ్లు ఆ బలిపీఠాన్ని నిర్మించారు. మోషే యెహోవాకు ప్రత్యేక సేవకుడు.

తమకు సమీపంలో నివసిస్తున్న ఇతర ప్రజలంటే వాళ్లు భయపడ్డారు. అయినా, వాళ్లు ఆగకుండా, పాత పునాది మీదనే బలీపీఠాన్ని నిర్మించి, ఉదయంపూట, సాయంత్రంపూటాదహనబలులు సమర్పిస్తూ వచ్చారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు వాళ్లు పర్ణశాలల పండుగ చేసుకున్నారు. ఆ పండుగ రోజులు పొడుగునా ప్రతిరోజూ సరైన సంఖ్యలో దహన బలులు సమర్పించారు. అటు తర్వాత, ప్రతి రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, శెలవు రోజులకూ, స్వేచ్ఛార్ఫణలను యెహోవా ఆజ్ఞ ప్రకారం అర్పించారు. జనం కూడా యెహోవాకు తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభించారు. ఈ విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆ ఇశ్రాయేలీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనారంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి నిర్మించబడకపోయినా కూడా ఈ బలి అర్పణ సాగింది.

దేవాలయ పునర్నిర్మాణం

చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్ల కలపను తెచ్చేందుకు ఇచ్చారు. సోలొమోను మొదటిగా దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లే, వాళ్లు కూడా ఈ దేవదారు చెట్ల కలపను ఓడల్లో సముద్రతీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. పారశీక రాజు కోరెషు ఇందుకు వారికి అనుమతినిచ్చాడు.

యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో[g] షయల్తీయేలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా కొడుకైన యేషూవ పని ప్రారంభించారు. వాళ్ల సోదరులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో కలిసి పనిచేయ ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు నిండినవాళ్లనీ, అంతకు పైబడినవాళ్లనీ యెహోవా దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియమించారు. దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను ఈ కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, కద్మీయేలు మరియు అతని కొడుకులు (యూదా వంశస్థులు); హేనాదాదు, మరియు అతని కొడుకులు, లేవీయులందరు. 10 పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందుకోసం తమ తమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది. 11 వాళ్లు కృతజ్ఞతాస్తుతులు[h] పాడారు.

“యెహోవా మంచివాడు.
    ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది”

అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు.

12 అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు. 13 ఆ ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International