Add parallel Print Page Options

యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం

(మత్తయి 26:31-35; లూకా 22:31-34; యోహాను 13:36-38)

27 యేసు వాళ్ళతో, “మీ మనస్సులు చెదరి పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో,

‘నేను గొఱ్ఱెల కాపరిని కొడతాను!
    గొఱ్ఱెలన్నీచెదరిపోతాయి!’(A)

అని వ్రాయబడింది. 28 కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.

29 అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు.

30 యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు[a] సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు.

31 కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు.

Read full chapter

Footnotes

  1. 14:30 రెండు కొన్ని గ్రీకు ప్రతులలో “రెండు” అన్న సంఖ్య లేదు.