నిర్గమకాండము 9
Telugu Holy Bible: Easy-to-Read Version
పశువులకు రోగం
9 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’ 2 ఇంకా నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే 3 పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు. 4 ఈజిప్టు జంతుజాలంకంటె ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యేకంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతువుల్లో ఏదీ చావదు 5 ఇదంతా జరగటానికి యెహోవా సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది జరిగేటట్టు యెహోవా చేస్తాడు.”
6 మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతువులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు. 7 ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు.
దద్దుర్లు
8 మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు, “మీ చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే, ఫరో ముందర గాలిలో ఈ బూడిదను వెదజల్లాలి. 9 ఇది దుమ్ముగా మారి ఈజిప్టు దేశం అంతటా వ్యాపిస్తుంది. ఈజిప్టులో ఎప్పుడెప్పుడు ఏ వ్యక్తిని లేక జంతువును ఈ దుమ్ము తాకుతుందో ఆ చర్మంమీద దద్దుర్లు పుడతాయి.”
10 మోషే, అహరోనులు కొలిమి నుండి బూడిద తీసుకొన్నారు. తర్వాత వెళ్లి ఫరో ఎదుట నిలబడ్డారు. ఆ బూడిదను వారు గాలిలో వెదజల్లారు, మనుష్యుల మీద, జంతువుల మీద దద్దుర్లు పుట్టడం మొదలయింది. 11 చివరికి మాంత్రికులకు కూడా ఆ దద్దుర్లు వచ్చినందువల్ల మోషే ఇలా చేయకుండా మాంత్రికులు కూడా ఆపలేక పోయారు. ఈజిప్టు అంతటా ఇది జరిగింది. 12 అయితే యెహోవా ఫరోను మొండి వాడిగా చేసాడు. అందుచేత మోషే, అహరోనుల మాట వినేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
వడగళ్లు
13 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఉదయాన్నే లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. ‘నన్ను ఆరాధించడానికి, నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. 14 నీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, నీ ప్రజలమీద, నీ అధికారుల మీద నా శక్తి అంతా ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడని నీకు తెలుస్తుంది. 15 నేను నా శక్తిని ప్రయోగించి, ఒక్క రోగం రప్పించానంటే, అది నిన్ను, నీ ప్రజల్ని భూమి మీద లేకుండా తుడిచి పారేస్తుంది. 16 అయితే ఒక కారణం వల్ల నేను నిన్ను ఇక్కడ ఉంచాను. నా శక్తిని నీవు చూడాలని నిన్ను ఇక్కడ ఉంచాను. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నా విషయం తెల్సుకొంటారు. 17 నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు. 18 కనుక రేపు ఈ వేళకు మహా బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు. 19 ఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టుకోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదైన ప్రతిదాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందుచేతనంటే పొలాల్లో నిలబడి ఉండే మనిషిగాని జంతువుగాని చచ్చినట్లే. ఇంట్లో చేర్చబడకుండా ఉండే ప్రతి దానిపైనా వడగళ్లు కురుస్తాయి.’”
20 ఫరో అధికారులలో కొందరు యెహోవా మాటను గమనించారు. వాళ్లు వెంటనే వారి పశువులన్నిటినీ, బానిసలందరినీ ఇండ్లలో చేర్చారు. 21 కాని మిగతా వాళ్లు యెహోవా సందేశాన్ని లెక్క చేయలేదు. అలాంటి వారు పొలాల్లో ఉన్న తమ బానిసలందరిని, జంతువులన్నింటిని అక్కడే ఉండ నిచ్చారు.
22 నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా వడగళ్ల వాన ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువుల మీద, మనుష్యులందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో యెహోవా చెప్పాడు.
23 కనుక మోషే తన కర్రను పైకి ఎత్తాడు, ఉరుములు, మెరుపులు వచ్చేటట్టు, భూమి మీద వడగళ్లు కురిసేటట్టు యెహోవా చేసాడు. ఈజిప్టు అంతటా వడగళ్లు పడ్డాయి. 24 వడగళ్లు పడుతోంటే, ఆ వడగళ్లతో పాటు మెరుపులు మెరిసాయి. ఈజిప్టు ఒక రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి, ఈజిప్టును ఇంత దారుణంగా దెబ్బతీసిన వడగళ్ల వాన ఇదే. 25 ఈజిప్టు పొలాల్లో ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్ల వాన నాశనం చేసింది. మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్లోని చెట్లన్నీ విరిగి పోయాయి. 26 ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను ఒక్కటే వడగళ్లు పడని ఒకే ఒక చోటు.
27 మోషే అహరోనులను ఫరో పిలిపించాడు. ఫరో వారితో, “ఈ సారి నేను పాపం చేసాను. యెహోవా న్యాయమంతుడు. తప్పు నాది, నా ప్రజలది. 28 వడగళ్లు, ఉరుములు మరీ భయంకరంగా ఉన్నాయి! వాటిని ఆపేయమని దేవుణ్ణి అడుగు. నేను మిమ్మల్ని వెళ్లిపోనిస్తాను. మీరు ఇక్కడ ఉండనక్కర్లేదు.” అని చెప్పాడు.
29 మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. ఈ భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు. 30 అయినా నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.”
31 అప్పుడే జనుము గింజ పట్టింది. యవలు అప్పుడే పూత పట్టాయి. అయిననూ ఈ మొక్కలు నాశనం అయ్యాయి. 32 అయితే గోధుమలు, మిరప ఇతర ధాన్యాలకంటె ఆలస్యంగా పక్వానికి వస్తాయి. అందుచేత ఈ మొక్కలు నాశనం కాలేదు. 33 మోషే ఫరోను విడిచి పట్టణం బయటికి వెళ్లాడు. యెహోవా యెదుట అతడు తన చేతులు చాచాడు. ఉరుములు, వడగళ్లు ఆగిపోయాయి. నేలమీద వర్షం కురవడం కూడ ఆగిపోయింది.
34 ఎప్పుడయితే వర్షం, వడగళ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూశాడో, అప్పుడు అతను మళ్లీ తప్పు చేసాడు. అతను అతని అధికారులు మళ్లీ మొండికెత్తారు. 35 ఇశ్రాయేలు ప్రజల్ని స్వేచ్ఛగా వెళ్లనిచ్చేందుకు నిరాకరించాడు ఫరో. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఇది జరిగింది.
Exodus 9
King James Version
9 Then the Lord said unto Moses, Go in unto Pharaoh, and tell him, Thus saith the Lord God of the Hebrews, Let my people go, that they may serve me.
2 For if thou refuse to let them go, and wilt hold them still,
3 Behold, the hand of the Lord is upon thy cattle which is in the field, upon the horses, upon the asses, upon the camels, upon the oxen, and upon the sheep: there shall be a very grievous murrain.
4 And the Lord shall sever between the cattle of Israel and the cattle of Egypt: and there shall nothing die of all that is the children's of Israel.
5 And the Lord appointed a set time, saying, To morrow the Lord shall do this thing in the land.
6 And the Lord did that thing on the morrow, and all the cattle of Egypt died: but of the cattle of the children of Israel died not one.
7 And Pharaoh sent, and, behold, there was not one of the cattle of the Israelites dead. And the heart of Pharaoh was hardened, and he did not let the people go.
8 And the Lord said unto Moses and unto Aaron, Take to you handfuls of ashes of the furnace, and let Moses sprinkle it toward the heaven in the sight of Pharaoh.
9 And it shall become small dust in all the land of Egypt, and shall be a boil breaking forth with blains upon man, and upon beast, throughout all the land of Egypt.
10 And they took ashes of the furnace, and stood before Pharaoh; and Moses sprinkled it up toward heaven; and it became a boil breaking forth with blains upon man, and upon beast.
11 And the magicians could not stand before Moses because of the boils; for the boil was upon the magicians, and upon all the Egyptians.
12 And the Lord hardened the heart of Pharaoh, and he hearkened not unto them; as the Lord had spoken unto Moses.
13 And the Lord said unto Moses, Rise up early in the morning, and stand before Pharaoh, and say unto him, Thus saith the Lord God of the Hebrews, Let my people go, that they may serve me.
14 For I will at this time send all my plagues upon thine heart, and upon thy servants, and upon thy people; that thou mayest know that there is none like me in all the earth.
15 For now I will stretch out my hand, that I may smite thee and thy people with pestilence; and thou shalt be cut off from the earth.
16 And in very deed for this cause have I raised thee up, for to shew in thee my power; and that my name may be declared throughout all the earth.
17 As yet exaltest thou thyself against my people, that thou wilt not let them go?
18 Behold, to morrow about this time I will cause it to rain a very grievous hail, such as hath not been in Egypt since the foundation thereof even until now.
19 Send therefore now, and gather thy cattle, and all that thou hast in the field; for upon every man and beast which shall be found in the field, and shall not be brought home, the hail shall come down upon them, and they shall die.
20 He that feared the word of the Lord among the servants of Pharaoh made his servants and his cattle flee into the houses:
21 And he that regarded not the word of the Lord left his servants and his cattle in the field.
22 And the Lord said unto Moses, Stretch forth thine hand toward heaven, that there may be hail in all the land of Egypt, upon man, and upon beast, and upon every herb of the field, throughout the land of Egypt.
23 And Moses stretched forth his rod toward heaven: and the Lord sent thunder and hail, and the fire ran along upon the ground; and the Lord rained hail upon the land of Egypt.
24 So there was hail, and fire mingled with the hail, very grievous, such as there was none like it in all the land of Egypt since it became a nation.
25 And the hail smote throughout all the land of Egypt all that was in the field, both man and beast; and the hail smote every herb of the field, and brake every tree of the field.
26 Only in the land of Goshen, where the children of Israel were, was there no hail.
27 And Pharaoh sent, and called for Moses and Aaron, and said unto them, I have sinned this time: the Lord is righteous, and I and my people are wicked.
28 Intreat the Lord (for it is enough) that there be no more mighty thunderings and hail; and I will let you go, and ye shall stay no longer.
29 And Moses said unto him, As soon as I am gone out of the city, I will spread abroad my hands unto the Lord; and the thunder shall cease, neither shall there be any more hail; that thou mayest know how that the earth is the Lord's.
30 But as for thee and thy servants, I know that ye will not yet fear the Lord God.
31 And the flax and the barley was smitten: for the barley was in the ear, and the flax was bolled.
32 But the wheat and the rie were not smitten: for they were not grown up.
33 And Moses went out of the city from Pharaoh, and spread abroad his hands unto the Lord: and the thunders and hail ceased, and the rain was not poured upon the earth.
34 And when Pharaoh saw that the rain and the hail and the thunders were ceased, he sinned yet more, and hardened his heart, he and his servants.
35 And the heart of Pharaoh was hardened, neither would he let the children of Israel go; as the Lord had spoken by Moses.
Exodul 9
Nouă Traducere În Limba Română
A cincea urgie: molimă peste animale
9 Apoi Domnul i-a zis lui Moise: „Du-te la Faraon şi spune-i: «Aşa vorbeşte Domnul, Dumnezeul evreilor: ‘Lasă-Mi poporul să plece ca să Mi se închine. 2 Dacă nu-l vei lăsa să plece şi-l vei opri din nou, 3 mâna Domnului va lovi cu molimă grea vitele de pe câmp: caii, măgarii, cămilele, cirezile şi turmele. 4 Dar Domnul va face deosebire între vitele lui Israel şi vitele Egiptului pentru ca nimic să nu moară din ce este al israeliţilor.’ 5 Domnul a hotărât o vreme, zicând că mâine va face acest lucru în ţară.»“ 6 În ziua următoare, Domnul a făcut întocmai: toate vitele egiptenilor au murit, dar din vitele israeliţilor n-a murit nici una. 7 Faraon a trimis pe cineva şi a aflat că nici una din vitele israeliţilor n-a murit. Inima lui Faraon însă a rămas împietrită şi tot nu a lăsat poporul să plece.
A şasea urgie: bube peste egipteni
8 Domnul le-a zis din nou lui Moise şi lui Aaron: „Umpleţi-vă mâinile cu cenuşă din cuptor şi Moise să o arunce în aer înaintea lui Faraon. 9 Ea se va transforma într-un praf fin peste toată ţara Egiptului şi va cauza bube cu puroi pe oameni şi pe animale în toată ţara Egiptului.“ 10 Ei au luat cenuşă din cuptor şi s-au înfăţişat înaintea lui Faraon. Moise a aruncat-o înspre cer şi ea a dat naştere la bube cu puroi pe oameni şi pe animale. 11 Vrăjitorii n-au putut sta înaintea lui Moise din cauza bubelor, pentru că bubele erau şi pe vrăjitori, ca pe toţi egiptenii. 12 Dar Domnul i-a împietrit inima lui Faraon şi acesta nu i-a ascultat, după cum îi spusese Domnul lui Moise.
A şaptea urgie: grindina
13 După aceea, Domnul i-a zis lui Moise: „Scoală-te dis-de-dimineaţă, du-te înaintea lui Faraon şi spune-i: «Aşa vorbeşte Domnul, Dumnezeul evreilor: ‘Lasă-Mi poporul să plece ca să Mi se închine, 14 pentru că de data aceasta Îmi voi trimite toate urgiile împotriva ta, împotriva slujitorilor tăi şi împotriva poporului tău, ca să ştii că nu este nimeni ca Mine pe întreg pământul. 15 Căci, dacă Mi-aş fi întins mâna şi te-aş fi lovit pe tine şi pe poporul tău cu molimă, ai fi pierit de pe pământ. 16 Dar te-am ridicat[a] ca să-ţi arăt puterea Mea şi astfel Numele Meu să fie vestit pe întreg pământul. 17 Încă mai continui să te ridici împotriva poporului Meu ca să nu-l laşi să plece? 18 Ei bine, mâine, pe vremea aceasta, voi face să cadă cea mai grea grindină din câte au căzut vreodată în Egipt, de când a fost întemeiat până acum. 19 De aceea trimite oamenii ca să adăpostească, la loc sigur, vitele şi tot ce ai pe câmp; orice om şi orice animal care va fi pe câmp şi nu la adăpost va muri atunci când grindina va cădea peste el.’»“ 20 Aceia dintre slujitorii lui Faraon care s-au temut de Cuvântul Domnului şi-au adăpostit sclavii şi vitele în case, 21 dar cei care n-au luat în seamă Cuvântul Domnului şi-au lăsat sclavii şi vitele pe câmp. 22 Domnul i-a zis lui Moise: „Întinde-ţi mâna spre cer ca să cadă grindină peste toată ţara Egiptului: peste oameni, peste animale şi peste plantele câmpului din ţara Egiptului.“ 23 Când Moise şi-a întins toiagul spre cer, Domnul a trimis o furtună cu grindină şi trăsnete care au căzut pe pământ. Domnul a făcut să cadă grindină peste ţara Egiptului: 24 era grindină amestecată cu trăsnete, o grindină atât de grea, cum n-a mai căzut niciodată în ţara Egiptului, de când aceasta a fost întemeiată ca neam. 25 Grindina a doborât la pământ tot ce era pe câmp în toată ţara Egiptului, atât oameni, cât şi animale; grindina a doborât la pământ toate plantele câmpului şi a frânt orice copac de pe câmp. 26 Singurul loc în care n-a căzut grindină a fost ţinutul Goşen[b], unde locuiau israeliţii. 27 Faraon şi-a trimis slujitorii să-i cheme pe Moise şi pe Aaron şi le-a zis:
– De data aceasta am păcătuit; Domnul este drept, eu şi poporul meu suntem răi. 28 Rugaţi-vă Domnului, căci ne este de ajuns trăsnetul şi grindina lui Dumnezeu! Vă las să plecaţi; nu mai trebuie să staţi.
29 Moise i-a răspuns:
– Cum voi ieşi din cetate, îmi voi ridica mâinile spre Domnul; trăsnetul nu va mai lovi şi nu va mai cădea grindină, ca să recunoşti că pământul este al Domnului. 30 Cât despre tine şi slujitorii tăi, ştiu că încă nu vă temeţi de Domnul Dumnezeu.
31 Plantaţiile de in şi de orz au fost distruse, pentru că orzul dăduse în spic şi inul înflorise, 32 însă cele de grâu şi secară albă n-au păţit nimic, pentru că erau sădite târziu. 33 Moise l-a lăsat pe Faraon, a ieşit din cetate şi şi-a ridicat mâinile spre Domnul; atunci trăsnetul şi grindina au încetat şi n-a mai plouat pe pământ. 34 Când Faraon a văzut că ploaia, grindina şi trăsnetul au încetat, a păcătuit din nou şi şi-a împietrit inima atât el, cât şi slujitorii săi. 35 Inima lui Faraon s-a împietrit şi nu i-a lăsat pe israeliţi să plece, după cum îi spusese Domnul lui Moise.
Footnotes
- Exodul 9:16 Sau: Dar te-am lăsat viu
- Exodul 9:26 Vezi nota de la 8:22
© 1997 Bible League International
Nouă Traducere În Limba Română (Holy Bible, New Romanian Translation) Copyright © 2006 by Biblica, Inc.® Used by permission. All rights reserved worldwide.